మంథని, ఆగస్టు 28 — అయుష్ 24 న్యూస్
మంథని మున్సిపాలిటీ పరిధిలోని మథర్ థెరిస్సా మహిళా పొదుపు సమితికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, పరిపాలనా వ్యవహారాలపై పూర్తిస్థాయి సమాచారం అందించాలని కోరుతూ నామని హరీష్ శుక్రవారం మంథని మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
మథర్ థెరిస్సా మహిళా పొదుపు సమితిలో జరుగుతున్న ఆర్థిక లావాదేవీలు, వడ్డీ రేట్లు, సంస్థకు ఉన్న పరిమితులు, అనుమతులు, సంస్థకు సంబంధించిన ఆడిట్ కాపీ, ఇతర ఆదాయ మార్గాలు తదితర వివరాలను అందించాలని ఆయన కోరారు.
అలాగే సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య, వారి విద్యార్హతలు, జీతభత్యాలు, ప్రస్తుతం ఉన్న మహిళా సభ్యుల సంఖ్య, సంస్థ ప్రారంభమైన సమయంలో ఉన్న సభ్యుల సంఖ్య తదితర అంశాలపై కూడా పూర్తి సమాచారాన్ని అందించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
సంస్థకు సంబంధించిన లెక్కలు, వివరాలు అడిగిన వారిని, సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే తొలగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని హరీష్ తెలిపారు. ఈ నేపథ్యంలో పొదుపు సంఘానికి సంబంధించిన అన్ని ఆర్థిక, పరిపాలనా వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని ఆయన కోరారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply