Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్–2026కు మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ఎంపిక● ఎం.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా 12వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్–2026కు మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ఎంపిక● ఎం.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా 12వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల
Home › బ్రేకింగ్ న్యూస్ › పోచమ్మ దేవాలయ నిర్మాణానికి గ్రానైట్, టైల్స్ బహూకరణ
బ్రేకింగ్ న్యూస్

పోచమ్మ దేవాలయ నిర్మాణానికి గ్రానైట్, టైల్స్ బహూకరణ

01:26 మధ్యాహ్నం PM

రూ.లక్ష విలువైన నిర్మాణ సామగ్రి అందజేత

రామగిరి, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): రామగిరి మండలం బేగంపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ దేవాలయానికి పాశం కొమురయ్య, గోవిందుల స్వామి కలిసి సుమారు రూ.లక్ష విలువైన గ్రానైట్, టైల్స్‌ను బహూకరించారు. ఆలయ నిర్మాణ పనులకు అవసరమైన సామగ్రిని ఆలయ కమిటీ సభ్యులకు వారు స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిర్మిస్తున్న పోచమ్మ దేవాలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు. ఆలయ నిర్మాణ పనులు త్వరగా పూర్తై భక్తులకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.

దేవాలయ నిర్మాణం పూర్తయితే భక్తులు పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు మరింత సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.

పోచమ్మ దేవాలయ నిర్మాణానికి గ్రామస్తులు, దాతలు, భక్తులు తమకు తోచిన విధంగా సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. నిర్మాణ సామగ్రిని అందజేసిన పాశం కొమురయ్య, గోవిందుల స్వామికి కమిటీ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారం ఇతర దాతలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాశం కొమురయ్య, గోవిందుల స్వామితో పాటు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 16🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App