మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు పరామర్శ
చందంపేట, సెప్టెంబర్ 2, 2026 | అయుష్ 24 న్యూస్: చందంపేట మండలం చిత్రియాల గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ పోషం పెద్దమ్మ శ్రీనయ్య తల్లి పోషం ఎల్లమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న పీఏసీఎస్ చైర్మన్ జాలే నరసింహారెడ్డి నేడు వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా పోషం ఎల్లమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎల్లమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

జాలే నరసింహారెడ్డి వెంట గ్రామశాఖ అధ్యక్షుడు బందెల వెంకటయ్య, మాజీ ఉపసర్పంచ్ యాదయ్య, ఈశ్వర్, నారయ్య, డీలర్ ఆంజనేయులు, చాట్ల బలరాం, మద్దిమడుగు కృష్ణ, వెంకటయ్య, పోషం వెంకటయ్య, పోషం ఆంజనేయులు, రాజు, సైదులు, నరసింహ తదితరులు ఉన్నారు.
అయుష్ 24 న్యూస్ 📰










Leave a Reply