హేమామృతకు స్వర్ణ పతకం.. రితిక్ రెడ్డికి కాంస్య పతకం
హైదరాబాద్, ఆగస్టు 25 | అయుష్ 24 న్యూస్
హైదరాబాద్‌లో నిర్వహించిన 1వ వరల్డ్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్–2026లో నేషనల్ అకాడమీ ఫర్ డ్యాన్స్ మార్షల్ ఆర్ట్స్ ఫిట్‌నెస్ సైన్స్ అసోసియేషన్ (NADMFSA)కు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు.
ఆగస్టు 21, 22, 23 తేదీల్లో హైదరాబాద్, తెలంగాణలో జరిగిన ఈ అంతర్జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో వివిధ విభాగాల్లో క్రీడాకారులు పోటీపడ్డారు.
B. హేమామృత అండర్–10 సంవత్సరాల 35 కిలోల కయోరుగు విభాగంలో స్వర్ణ పతకం సాధించి సత్తా చాటింది. అలాగే వొంగటి రితిక్ రెడ్డి అండర్–14 సంవత్సరాల 65 కిలోల లోపు కయోరుగు విభాగంలో కాంస్య పతకం సాధించాడు.

ఈ సందర్భంగా విజేతలు తమ పతకాలను లెజెండరీ గ్రాండ్‌మాస్టర్ జయంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా NADMFSA డైరెక్టర్, మాస్టర్, కోచ్ డా. జి. విజయ్ కుమార్ను, పతకాలు సాధించిన క్రీడాకారులను పలువురు అభినందించారు. డా. జి. విజయ్ కుమార్ తైక్వాండో అడ్వాన్స్‌డ్ సర్టిఫికేషన్ కోర్సును పూర్తి చేయడం కూడా విశేషమని నిర్వాహకులు తెలిపారు.
అలాగే సిరికొండ ఉపేందర్ మాస్టర్, ఉపేందర్ తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ (UTMA) వ్యవస్థాపకులు, సీనియర్ తైక్వాండో మాస్టర్ ఎస్.ఏ. మొయినుద్దీన్ ఆధ్వర్యంలోని బృందానికి అమికల్ స్పోర్ట్స్ అకాడమీ, అమికల్ స్పోర్ట్స్ ఫెడరేషన్, జేఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ప్రపంచ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం పట్ల నిర్వాహకులు, కోచ్‌లు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని దేశానికి, తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply