Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి
Home › బ్రేకింగ్ న్యూస్ › ప్రమాదం జరిగాకే మేల్కొంటారా?
బ్రేకింగ్ న్యూస్

ప్రమాదం జరిగాకే మేల్కొంటారా?

01:17 మధ్యాహ్నం PM

మూలమలుపులో మట్టి కుప్ప.. అధికారుల నిర్లక్ష్యంపై వాహనదారుల ఆగ్రహం

అనుకోని ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?

మంథని, సెప్టెంబర్ 20 (ప్రతినిధి): పెద్దపల్లి జిల్లా మంథని లైన్‌గడ్డ సమీపంలోని ప్రధాన రహదారిపై మూలమలుపు వద్ద మట్టి కుప్ప ప్రమాదకరంగా పేరుకుపోయింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారిపై మట్టి కుప్ప ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు తొలగించకపోవడంపై వాహనదారులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మూలమలుపు కావడంతో ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. రహదారిపై ప్రమాదకర పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.

“ప్రమాదం జరగడానికి ముందే కనిపిస్తున్న మట్టి కుప్పను తొలగించలేరా? ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు స్పందించాలా?” అంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ప్రధాన రహదారిపై ఉన్న మట్టి కుప్పను వెంటనే తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. అలాగే ఆర్‌అండ్‌బీ అధికారులు కూడా రహదారి భద్రతపై దృష్టి సారించి అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించేలోపు అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

— ఆయుష్ 24 న్యూస్
The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 32🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App