బీఎల్ఏల ద్వారా ఓటర్లకు సంబంధించిన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలి
మంథని, ఆగస్టు 31, అయుష్ 24 న్యూస్: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు సూచనల మేరకు మంథనిలో ఓటర్ల జాబితాకు సంబంధించిన ఫామ్–6, ఫామ్–7, ఫామ్–8లను క్లస్టర్ ఇన్చార్జిలకు అందజేశారు.
మంత్రి క్యాంపు కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లస్టర్ ఇన్చార్జిలు బూడిద శంకర్, అయిలి శ్రీనివాస్, చంద్రు రాజమల్లు, సమ్మయ్యలకు ఫామ్–6, ఫామ్–7, ఫామ్–8లను అందజేశారు.
క్లస్టర్ ఇన్చార్జిల ద్వారా ఆయా ప్రాంతాలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్ఏలకు) ఫారాలను చేరవేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అయుష్ 24 న్యూస్ | The Voice of Truth









Leave a Reply