Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు
Home › మంథని › ఫొటోగ్రాఫర్ కొఠారి శ్రీనివాస్‌కు రెండు అవార్డులు
మంథని

ఫొటోగ్రాఫర్ కొఠారి శ్రీనివాస్‌కు రెండు అవార్డులు

01:17 మధ్యాహ్నం PM

బెస్ట్ ఏఐ ఎడిటర్, వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో ప్రతిభకు గుర్తింపు

భారత్ కళా పురస్కార్-2026 అందుకున్న మంథని వాసి

మంథని, అక్టోబర్ 6, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

ఫొటోగ్రఫీ రంగంలో ఫొటోగ్రాఫర్‌గా, ఏఐ ఎడిటర్‌గా సేవలందిస్తున్న పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమనపల్లికి చెందిన కొఠారి శ్రీనివాస్‌కు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది.

హైదరాబాద్‌ శంషాబాద్‌లోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్‌లో ఈ నెల 2, 3, 4 తేదీల్లో నిర్వహించిన ఫొటో ట్రేడ్ షో సందర్భంగా జరిగిన జాతీయ స్థాయి భారత్ కళా పురస్కార్-2026 వెడ్డింగ్ ఫొటోగ్రఫీ, ఏఐ ఎడిటర్ పోటీల్లో ఆయన ప్రతిభ కనబరిచారు. ఉత్తమ ఏఐ ఎడిటర్, వెడ్డింగ్ ఫొటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను ట్రేడ్ షో నిర్వాహకుల చేతుల మీదుగా అందుకున్నారు.

భారత్ కళా పురస్కార్-2026తో మరో గౌరవం

శ్రీనివాస్ ప్రతిభను గుర్తించి రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఫొటోగ్రఫీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సినీ నటుల చేతుల మీదుగా ఆయన అవార్డులను అందుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో ఉత్తమ వెడ్డింగ్ వీడియోగ్రఫీ, ఏఐ ఎడిటర్ విభాగాల్లో భారత్ కళా పురస్కార్-2026 అందుకోవడం తనకు ఎంతో ప్రత్యేకమైన విషయమన్నారు. తన ప్రతిభను గుర్తించి పురస్కారాలతో సత్కరించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. తన ఫొటోగ్రఫీ ప్రయాణంలో ప్రోత్సాహం, సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సిగ్మా ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎంసి. శేఖర్, ట్రేడ్ షో నిర్వాహకులు ఎడిట్ పాయింట్ రమేష్, ఫొటోటెక్ అధినేత అభిమన్యురెడ్డి, తెలంగాణ మాజీ ఫొటోగ్రఫీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సినీ నటులు తదితరులతో పాటు దేశవ్యాప్తంగా వేలాది మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 26🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App