వార్డు సభ్యుల వివరణ
దేవరకొండ, సెప్టెంబర్ 10 (అయుష్ 24 న్యూస్): చింతపల్లి మండలం వెంకటపేట గ్రామంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీని చించారనే ఆరోపణల్లో వాస్తవం లేదని గ్రామానికి చెందిన వార్డు సభ్యులు తెలిపారు.
గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. గతంలో బీజేపీ నాయకులు బ్రహ్మోత్సవాల సందర్భంగా సుమారు ఆరు నెలల క్రితం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ల ద్వారా తొలగించినట్లు తెలిపారు. ఫ్లెక్సీని చించలేదని, దానిని తొలగించే సమయంలోనే సంబంధిత ఫ్లెక్సీ తమ వద్ద ఉందని పేర్కొన్నారు.
ఈ విషయంపై అసత్య ప్రచారాలు చేయవద్దని వార్డు సభ్యులు సూచించారు. గ్రామంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేలా తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండాలని కోరారు.



Musini.Anjan





Leave a Reply