– మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
మంథని, ఆగస్టు 25, ఆయుష్ 24 న్యూస్
వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించేందుకు విశేష కృషి చేసిన మహనీయుడు బీపీ మండల్ అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కొనియాడారు.
బిందేశ్వరి ప్రసాద్ మండల్ జయంతి సందర్భంగా మంథని పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పుట్ట మధూకర్ ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిందేశ్వరి ప్రసాద్ మండల్ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్గా పనిచేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన రూపొందించిన నివేదిక **‘మండల్ కమిషన్ నివేదిక’**గా చరిత్రలో నిలిచిందన్నారు.
బీసీల హక్కుల కోసం బీపీ మండల్ చేసిన పోరాటాల ఫలితంగానే నేడు వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు అందుతున్నాయని పుట్ట మధూకర్ పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
అయుష్ 24 న్యూస్
www.ayush24news.com










Leave a Reply