అక్రమంగా నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
ఎక్లాస్పూర్, సెప్టెంబర్ 20 (ప్రతినిధి): గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు బెల్టు షాపులను పూర్తిస్థాయిలో మూసివేయాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం నిర్ణయించింది. ఈ మేరకు సెప్టెంబర్ 20న నిర్వహించిన అత్యవసర సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు పంచాయతీ పాలకవర్గం తెలిపింది.
ఇప్పటికే సెప్టెంబర్ 15న బెల్టు షాపుల నిర్వాహకులు తమ దుకాణాలను మూసివేస్తామని గ్రామ పంచాయతీకి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే కొందరు నిర్వాహకులు ఇప్పటికీ బెల్టు షాపులను కొనసాగిస్తున్నట్లు గ్రామస్థులు పంచాయతీ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఇకపై బెల్టు షాపులను నిర్వహిస్తే సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు పంచాయతీ పాలకవర్గం వెల్లడించింది.
బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందించే వారికి ₹2,000 ప్రోత్సాహక బహుమతి అందజేస్తామని ప్రకటించింది. అయితే బెల్టు షాపు నిర్వహిస్తున్నట్లు నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తికి ₹20,000 జరిమానా విధిస్తామని పంచాయతీ నిర్ణయించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం, ప్రజల ఆరోగ్యం, గ్రామ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బెల్టు షాపుల నియంత్రణకు ప్రజలు సహకరించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం కోరింది.
ఇట్లు:
గ్రామ పంచాయతీ పాలకవర్గం, ఎక్లాస్పూర్
— ఆయుష్ 24 న్యూస్
The Voice of Truth










Leave a Reply