లింగమంతుల స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బాలు నాయక్
ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
చింతపల్లి, సెప్టెంబర్ 3 (ఆయుష్ 24 న్యూస్): చింతపల్లి మండలం ఉప్పరిపల్లి గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ లింగమంతుల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని స్వామివారిని మొక్కుకున్నారు.
అనంతరం గ్రామంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మించిన నూతన గృహాల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వడ్లకొండ శంకర్–నిర్మల, బండ్ల వెంకటయ్య–లక్ష్మమ్మ కుటుంబాల నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేద కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నామని పేర్కొన్నారు. బోనాల పండుగ రోజునే పేద కుటుంబాలు తమ సొంతింట్లో గృహప్రవేశం చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జటావత్ హరి నాయక్, మాజీ ఎంపీపీ కొండూరు పవన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల వెంకటయ్య గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు అంగిరేకుల నాగభూషణం, స్థానిక సర్పంచ్ మెండే వెంకట్ యాదవ్, ఉప సర్పంచ్ బాలాగోని అలివేలు–దేవయ్య, మాజీ ఎంపీటీసీ గుణమోని కొండల్ యాదవ్, చందంపేట మండల అధ్యక్షుడు దొండేటి మల్లారెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ తదితరులతో పాటు మెండే బిక్షం, ఉజ్జిని రవీందర్‌రావు, జనార్ధన్‌రావు, నిర్మల్‌రావు, మెండే శ్రీను, శ్రీశైలం, దశరథ, లింగయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.
— Ayush 24 News
బోనాల పండుగ వేళ ఉప్పరిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల సంబురం
లింగమంతుల స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం చింతపల్లి, సెప్టెంబర్ 3 (ఆయుష్ 24 న్యూస్): చింతపల్లి మండలం ఉప్పరిపల్లి గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్
03సెప్టెంబర్2026
12:58 మధ్యాహ్నం PM
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.

AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →
Mahamood Mohammed






Leave a Reply