ఛత్తీస్‌గఢ్, ఆగస్టు 26, అయుష్ 24 న్యూస్: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భండార్‌పదర్, మునుర్‌కొండ అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్, .315 బోర్ తుపాకీ, మస్కెట్ రైఫిల్, బీజీఎల్ లాంచర్, గ్రెనేడ్లు తదితర ఆయుధాలు, సామగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం నేపథ్యంలో అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మరింత విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. నక్సల్స్ కార్యకలాపాలపై నిఘాను మరింత ముమ్మరం చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.










Leave a Reply