మంథని, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగస్టు 19న మంథని నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు ప్రజా సమావేశాల్లో పాల్గొననున్నారు.
ఉదయం 10:30 గంటలకు గర్రెపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలు
సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో ఉదయం 10:30 గంటలకు పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే పబ్లిక్ మీటింగ్‌లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొననున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు NAC స్కిల్ డెవలప్‌మెంట్ బిల్డింగ్‌కు శంకుస్థాపన
మధ్యాహ్నం 2 గంటలకు మంథనిలోని గంగాపురి వద్ద NAC స్కిల్ డెవలప్‌మెంట్ బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొననున్నారు.
9 గ్రామాలకు 9 వైకుంఠ రథాలు
మధ్యాహ్నం 2:20 గంటలకు మంథని పెట్రోల్ బంక్ చౌరస్తా వద్ద CSR నిధుల కింద నాలుగు మండలాలకు చెందిన తొమ్మిది గ్రామాలకు తొమ్మిది వైకుంఠ రథాలను ప్రారంభించనున్నారు.
మైదుపల్లి, ఎక్లాస్‌పూర్, గుంజపడుగు, అడవి సోమనపల్లి, కేశనపల్లి, మచ్చుపేట, సుందిళ్ల, కమాన్‌పూర్, రాణాపూర్ గ్రామాలకు చెందిన సర్పంచులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
రూ.164.64 కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మధ్యాహ్నం 2:30 గంటలకు మంథని బస్ డిపో వద్ద రూ.164.64 కోట్ల విలువైన పలు రోడ్డు అభివృద్ధి పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధానంగా:
- మంథని టౌన్‌లో బ్రిడ్జి రోడ్ నుంచి బస్ డిపో వరకు వెడల్పు డ్రైన్ నిర్మాణానికి రూ.15 కోట్లు.
- సెంట్రల్ లైటింగ్ కోసం రూ.1.20 కోట్లు.
- గాంధీచౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ పనులకు రూ.59 లక్షలు.
- అంబేద్కర్ చౌక్ నుంచి ముత్యాలమ్మ ఆలయం వరకు రోడ్డు వెడల్పు పనులకు రూ.35 లక్షలు.
- క్యాంప్ ఆఫీస్ రోడ్డుకు రూ.50 లక్షలు.
- మంథని పట్టణంలోని ఇతర వార్డుల్లో రోడ్ల అభివృద్ధికి రూ.9 కోట్లు.
- మంథని డిపో నుంచి డిగ్రీ కళాశాల వరకు CRF నిధులతో రోడ్డు అభివృద్ధికి రూ.21 కోట్లు.
- మంథని డిపో నుంచి గోదావరి వరకు 2 కిలోమీటర్ల నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.22 కోట్లు.
- సూరయ్యపల్లి నుంచి కాకర్లపల్లి మీదుగా సీతంపేట వరకు 10.8 కిలోమీటర్ల రోడ్డు వెడల్పు పనులకు రూ.29.94 కోట్లు.
- గుంజపడుగు నుంచి ఉప్పట్ల మీదుగా విలోచవరం వరకు 10.9 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధికి రూ.8.78 కోట్లు.
- కూనారం నుంచి ముత్తారం వరకు 18 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధికి రూ.36.28 కోట్లు.
సాయంత్రం 3 గంటలకు భారీ ప్రజా సమావేశం
మధ్యాహ్నం 3 గంటలకు మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే ప్రజా సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలకు సంబంధించిన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీతో పాటు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, మైనార్టీలకు కుట్టుమిషన్లు, మహిళా స్వశక్తి సంఘాలకు చెక్కుల పంపిణీ చేయనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు.
రామగుండంలో అభివృద్ధి కార్యక్రమాలు
అనంతరం సాయంత్రం 4:30 గంటలకు రామగుండంలో నిర్వహించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొననున్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply