చివరి తేదీ సమీపిస్తుండటంతో ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ
అయుష్ 24 న్యూస్ | మంథని
మంథని మండలంలో ఓటర్ల సర్వే కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతోంది. గడువు సమీపిస్తుండటంతో అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు.
ఓటరు పేరులో, ఇంటి పేరులో, తండ్రి పేరులో లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేసుకునే అవకాశం కల్పిస్తూ నేరుగా ఓటర్ల ఇళ్ల వద్దకే వెళ్లి వివరాలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సర్వే సిబ్బంది మిట్ట సుజాత మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమ నిబంధనలను పాటిస్తూ ఓటర్ల నుంచి ఖచ్చితమైన వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల వివరాల నమోదు, సవరణ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
సర్వే ప్రక్రియకు మంథని మండలంలోని ఓటర్లు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆమె తెలిపారు. నిర్ణీత గడువులోగా అర్హులైన ఓటర్ల వివరాల సేకరణ, అవసరమైన సవరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.









Leave a Reply