Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › మంథనిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి బీజేపీ, రైతుల యత్నం
బ్రేకింగ్ న్యూస్

మంథనిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి బీజేపీ, రైతుల యత్నం

01:40 మధ్యాహ్నం PM

24 గంటల విద్యుత్ సరఫరా హామీ అమలు చేయాలని డిమాండ్

విద్యుత్ డీఈకి వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు, రైతులు

మంథని, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్:

బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన ‘రైతు గోస.. బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీజేపీ నాయకులు, రైతులతో కలిసి మహాధర్నా నిర్వహించారు.

అనంతరం బీజేపీ నాయకులు, రైతులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, చల్లా నారాయణ రెడ్డి పాల్గొన్నారు.

హామీ మేరకు 24 గంటల కరెంటు ఇవ్వాలి: సునీల్ రెడ్డి

ఈ సందర్భంగా చంద్రుపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్నప్పటికీ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఎన్నికల సమయంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చి, ప్రస్తుతం తక్కువ సమయం విద్యుత్ సరఫరా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందుల కారణంగా రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనూ రైతులు సాగునీటి కోసం ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా అందించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

అనంతరం బీజేపీ నాయకులు, రైతులు మంథని విద్యుత్ శాఖ డీఈని కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొండపాక సత్యప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షుడు మచ్చగిరి రాము, నియోజకవర్గ కో-కన్వీనర్ నంపెళ్లి రమేష్, మండల అధ్యక్షులు విరబోయిన రాజేందర్, సబ్బాని సంతోష్, కొయ్యడ సతీష్, పగే రంజిత్, కొండ్రు లక్ష్మణ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఎల్కా సదానందం, సీనియర్ నాయకులు రాపర్తి సంతోష్, మట్ట శంకర్, దుర్గం తిరుపతి, మల్లారపు అరుణ్, చిలువేరు సతీష్, మల్లారెడ్డి, కోడారి దేవేందర్, ఎలావెన సమ్మయ్య, సేనవేన సునీల్, పత్తి మహేందర్ రెడ్డి, విశ్వాతేజ, సామల అశోక్, ఎడ్ల సాగర్, భానుప్రకాశ్, తొట్ల రాజు, శంకర్, కసిపేట సాంబయ్య, మణుగు కొమురయ్య, విష్ణు, ప్రకాష్, గురువేష్, హేమంత్, సాయి, స్వరూప, రాజశేఖర్, ఆనంద్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 54🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
1 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *