తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన మంథని డివిజన్ పాస్టర్ అసోసియేషన్ ప్రతినిధులు
మంథని, సెప్టెంబర్ 10 (అయుష్ 24 న్యూస్): మంథని పట్టణంలో క్రైస్తవ కమ్యూనిటీ భవన నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ గురువారం మంథని డివిజన్ పాస్టర్ అసోసియేషన్ ప్రతినిధులు స్థానిక తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ డివిజన్ అధ్యక్షుడు పాస్టర్ శ్రీనివాస్ పాల్ మాట్లాడుతూ.. మంథని పట్టణంలో క్రైస్తవ కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రూ.50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
అయితే భవన నిర్మాణానికి అవసరమైన స్థలం ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో పనులు ప్రారంభించలేకపోతున్నామని ఆయన పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి పట్టణ పరిధిలో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి భవన నిర్మాణానికి కేటాయించాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన తహశీల్దార్ స్పందిస్తూ.. ఈ అంశంపై క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాస్టర్ శ్రీనివాస్ పాల్, ఎ. జోసెఫ్, ఎం. రామయ్య తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply