మంథని, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గీతా పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి స్థానిక గౌడ సంఘం నాయకులు, గౌడ సోదరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజన రాజ్యం కోసం 376 సంవత్సరాల క్రితమే పోరాడిన మహాయోధుడని కొనియాడారు. గౌడ కులంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తమకు గర్వకారణమని అన్నారు.
ఆయన చూపిన ధైర్యం, ఆత్మగౌరవం, సమానత్వం, బహుజన రాజ్య స్థాపన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని, భావితరాలకు ఆయన చరిత్ర, పోరాట స్ఫూర్తిని అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మంథని గౌడ సంఘం అధ్యక్షుడు మాచిడి వీర శంకర్ గౌడ్, 3వ వార్డు కౌన్సిలర్ మాచిడి రాజు గౌడ్, గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు మాచిడి రవితేజ గౌడ్, గౌడ సంఘం నాయకులు పూదరి సమ్మయ్య గౌడ్, మాచిడి మోహన్ గౌడ్, మేడగోని రాజమౌళి గౌడ్, ఎగోలపు చిన్న శంకర్ గౌడ్, కమ్మగొని శంకర్ గౌడ్, మాచిడి సత్యనారాయణ గౌడ్, తాటి సమ్మయ్య గౌడ్, మాచిడి నరేష్ గౌడ్‌తో పాటు పలువురు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply