మంథని, సెప్టెంబర్ 20 (ప్రతినిధి):
మంథని మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మందట, మహాలక్ష్మి ఆలయం సమీపంలోని గణపతి మండపం, రావుల చెరువు కట్టలోని బాల గజానన మండలి, వడ్లవాడ, కన్యకా పరమేశ్వరి ఆలయం, విశ్వబ్రాహ్మణ వీధి, సుభాష్‌నగర్, ఉస్మాన్పుర, మసీదు వాడలోని స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలోని గణపతి మండపం, బోయినపేట, పాత బస్టాండ్, వాగుగడ్డ, హమాలీ సంఘం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథులను మంత్రి దర్శించుకున్నారు.
గణనాథుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు, మంథని నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ప్రార్థించారు.
అనంతరం ఆయా గణపతి మండపాల వద్ద అర్చకులు, కమిటీ సభ్యులు వేదమంత్రాలతో మంత్రిని ఆశీర్వదించారు. కమిటీ సభ్యులు శాలువాలతో మంత్రి శ్రీధర్ బాబును ఘనంగా సన్మానించారు.











Leave a Reply