మంథని, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంథనిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ, ధర్నా నిర్వహించారు. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు బతుకమ్మ ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. “కళ్యాణలక్ష్మి గోవిందా.. షాదీ ముబారక్ గోవిందా.. రూ.4,000 పింఛన్ గోవిందా.. మహిళలకు నెలకు గోవిందా” అంటూ నినాదాలు చేశారు.
అనంతరం మంథని ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.
420 హామీలను అమలు చేయాలి
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన నిధులను విడుదల చేసి అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం అందించాలని కోరారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుందని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మహిళా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply