గత కార్యక్రమాలపై సమీక్ష.. భవిష్యత్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానం
మంథని, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): విశ్వహిందూ పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ మంథని ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇప్పటివరకు నిర్వహించిన వివిధ కార్యక్రమాలను సమీక్షించారు. రాబోయే రోజుల్లో సమాజ సేవకు మరింత ప్రాధాన్యతనిస్తూ “మానవ సేవే మాధవ సేవ” అనే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు.
సమాజంలోని అవసరమైన వర్గాలకు తమ వంతు సహకారం అందిస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని సభ్యులు నిర్ణయించారు. కార్యక్రమంలో సంస్థకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
జై శ్రీరామ్ 🚩
జై శ్రీకృష్ణ 🦚
హరే రామ హరే కృష్ణ 🙏









Leave a Reply