Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › మంథని అభివృద్ధిపై మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక దృష్టి
బ్రేకింగ్ న్యూస్

మంథని అభివృద్ధిపై మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక దృష్టి

02:51 మధ్యాహ్నం PM

రూ.9 కోట్లతో అంతర్గత సీసీ రోడ్లు.. రూ.15 కోట్లతో రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనులు

మంథని, ఆగస్టు 31, అయుష్ 24 న్యూస్: మంథని పట్టణ అభివృద్ధిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు, ప్రధాన రహదారుల విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌ తదితర మౌలిక వసతుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.

ఇందులో భాగంగా వినాయక టెంపుల్‌ నుంచి ఎరుకల గూడెం వరకు, వినాయక టెంపుల్‌ నుంచి తమ్మిచెరువు కట్ట వరకు సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టారు. మంథని పట్టణంలోని వివిధ వార్డుల్లో అంతర్గత సీసీ రోడ్ల అభివృద్ధికి సుమారు రూ.9 కోట్లు కేటాయించి ఆగస్టు 19న పనులకు శంకుస్థాపన చేశారు.

అలాగే బ్రిడ్జి రోడ్డు నుంచి బస్‌ డిపో వరకు రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మాణానికి రూ.15 కోట్లతో పనులు చేపట్టేందుకు చర్యలు ప్రారంభించారు. గాంధీచౌక్‌–అంబేద్కర్‌ చౌక్‌ రోడ్డు విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌, అంబేద్కర్‌ చౌక్‌–ముత్యాలమ్మ ఆలయం వరకు రోడ్డు విస్తరణ, క్యాంప్‌ ఆఫీస్‌ రోడ్డు అభివృద్ధి పనులకు కూడా నిధులు కేటాయించారు.

మంథని నియోజకవర్గంలో గత రెండున్నరేళ్లలో సుమారు రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినట్లు ఆగస్టు 19న జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు ఇతర మంత్రులు వెల్లడించారు. ఇటీవల రూ.164 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి.

మంథని డిపో నుంచి డిగ్రీ కళాశాల వరకు రహదారి అభివృద్ధికి రూ.21 కోట్లు కేటాయించారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.5.25 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, వినాయక టెంపుల్‌–ఎరుకల గూడెం, వినాయక టెంపుల్‌–తమ్మిచెరువు కట్ట మార్గాల్లో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను మంథని మున్సిపల్‌ చైర్మన్‌ ఒడ్నాల శ్రీనివాస్, వైస్‌ చైర్మన్‌ ముస్కుల సయేందర్‌ రెడ్డి, కౌన్సిలర్లు పెంటరి రాజు, ఎల్లంకి వంశీ సోమవారం పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిని పరిశీలించి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్‌ తదితర మౌలిక వసతుల అభివృద్ధి పనులు పూర్తయితే మంథని పట్టణ రూపురేఖలు మారనున్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయుష్ 24 న్యూస్ | The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 34🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
1 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *