ఎల్ఐసీ 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మంథని, సెప్టెంబర్ 1 | అయుష్ 24 న్యూస్
భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంథని ఎల్ఐసీ కార్యాలయంలో బీమా వారోత్సవాలను అధికారులు, వికాసాధికారులు, ఏజెంట్లు, పాలసీదారులు ఘనంగా ప్రారంభించారు.
జ్యోతి ప్రజ్వలన అనంతరం ఇన్చార్జి మేనేజర్ అచ్యుత రావు, ఏఏఓ వేణుగోపాల్, వికాసాధికారులు బెజ్జాల హరికిరణ్, అఖిల్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. 1956లో రూ.5 కోట్ల మూలధనంతో ప్రారంభమైన ఎల్ఐసీ ప్రస్తుతం రూ.60 లక్షల కోట్ల సంపదతో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
పాలసీదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త పాలసీలు, సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి త్వరితగతిన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఏజెంట్లు, సిబ్బంది, పాలసీదారులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 7న బీమా వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.









Leave a Reply