మంథని, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): మంథని పట్టణంలోని పోచమ్మవాడ రైతు కార్మిక గజానన మండలి ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడిని మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి శనివారం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మంథని పట్టణ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు.
ఈ పూజా కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు లైశెట్టి రజిత రాజు, ఎల్లెంకి వంశీ, జంభోజు సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు కొత్త కోటేష్, వేముల హరీష్, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.
పూజా కార్యక్రమం అనంతరం ఉత్సవ కమిటీ నిర్వాహకులు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు ప్రముఖులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.










Leave a Reply