క్రైస్తవ సమాజ సంక్షేమం, అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని వెల్లడి
మంథని, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): మంథని డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడిగా ఎన్నికైన పాస్టర్ జె. శ్రీనివాస్ పాల్ శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పాస్టర్ జె. శ్రీనివాస్ పాల్ మంత్రి శ్రీధర్ బాబును శాలువాతో సత్కరించారు. అనంతరం మంథని డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాస్ పాల్‌ను మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు.
క్రైస్తవ సమాజ సంక్షేమం, అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. క్రైస్తవ సమాజానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.
ఈ సందర్భంగా పాస్టర్ జె. శ్రీనివాస్ పాల్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి మంథని డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. క్రైస్తవ సమాజ సంక్షేమం, అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.









Leave a Reply