మల్కాజిగిరి, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో బీఆర్‌ఎస్‌కు చెందిన ఉద్యమకారుడు, మాజీ కార్పొరేటర్ ఏకే మురుగేష్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మాజీ టెంపుల్ చైర్మన్ జీ. కృష్ణ గౌడ్, జీ. జగమేష్ గౌడ్, జీ. ఎల్లేష్, కే. శ్రీనివాస్ రెడ్డి, ఏ. శ్రీనివాస్ గౌడ్, మొగెందర్, దేవి, ఈశ్వర్, బాలరాజ్, సూరి, మల్లారెడ్డి, సాయి చారి, షేక్ అబ్బాస్, అబ్బన్న, నరసింహ, స్వామి కుమార్, సైదులు, రాజు, విక్రమ్, రాజేష్, బోర్వెల్ శ్రీనివాస్, వెంకట్, రాజ్, లక్ష్మణ్ నాయక్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలతో కలిసి మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply