ఉట్టి కొట్టి వేడుకల్లో ఉత్సాహం నింపిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు
మహాదేవపూర్, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు హాజరై వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన దుద్దిళ్ల శ్రీను బాబు, భక్తులు, ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీకృష్ణుడి బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని, ధర్మం, సత్యం, న్యాయం కోసం ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని దుద్దిళ్ల శ్రీను బాబు పేర్కొన్నారు. శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
అనంతరం జన్మాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో దుద్దిళ్ల శ్రీను బాబు ఉత్సాహంగా పాల్గొని ఉట్టి కొట్టారు. దీంతో వేడుకల ప్రాంగణంలో సందడి నెలకొంది.









Leave a Reply