రామగిరిలో వైఎస్సార్ 17వ వర్ధంతి కార్యక్రమం
సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు: తొట్ల తిరుపతి యాదవ్
రామగిరి, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ అన్నారు.
వైఎస్సార్ 17వ వర్ధంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు బుధవారం రామగిరి మండలం బేగంపేట్ ఎక్స్‌రోడ్‌లోని మంథని బ్లాక్ కాంగ్రెస్ కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రొడ్డ బాపన్న పటేల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి తొట్ల తిరుపతి యాదవ్ హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ‘వైఎస్సార్ అమర్ రహే’ అంటూ నినాదాలు చేశారు.
పాదయాత్రను గుర్తుచేసుకున్న తిరుపతి యాదవ్
ఈ సందర్భంగా తొట్ల తిరుపతి యాదవ్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్సార్ చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రను గుర్తుచేసుకున్నారు. సిరిసిల్ల ప్రాంతంలో సాగిన ఆ పాదయాత్రలో తాను, ప్రస్తుత రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొనడం తనకు గర్వకారణమని తెలిపారు.

ఆ సమయంలో వైఎస్సార్ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అహర్నిశలు శ్రమించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశారని పేర్కొన్నారు.
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని తిరుపతి యాదవ్ అన్నారు. ఈ పథకాల కారణంగానే వైఎస్సార్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.
వైఎస్సార్ అకాల మరణం రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆయన మరణించిన సమయంలో ప్రజలు చూపిన అభిమానం, అభిమాన నేతపై ఉన్న అనుబంధానికి నిదర్శనమని అన్నారు.
కాంగ్రెస్ శ్రేణులు ఏకతాటిపై నడవాలి
వైఎస్సార్ మరణానంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తొట్ల తిరుపతి యాదవ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం ప్రతి కార్యకర్త గర్వంగా భావించాలని అన్నారు.
రాబోయే రోజుల్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ కాంగ్రెస్ శ్రేణులంతా ఏకతాటిపై ఉండాలని, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కమాన్‌పూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్.ఎస్. అన్వర్, రామగిరి మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు బండారి సదానందం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కండె పోషం, మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, ఆదివారం పేట సర్పంచ్ ఇల్లందుల సంజీవ్, నవాబ్‌పేట సర్పంచ్ రొడ్డ మౌనిక కుమార్, పుల్లెల వీరగోని రమాదేవి శ్రీనివాస్, సర్పంచ్ కొండవేన దివ్య సుధాకర్, మాజీ సర్పంచులు తీగల సమ్మయ్య, దేవునూరి రజిత శ్రీనివాస్, ఎరుకల ఓదెలు, కెక్కర్ల శ్రీనివాస్, ఉట్ల గోపాల్‌రెడ్డి, కాలేశ్వరం దేవస్థానం డైరెక్టర్ కాటం సత్యం, రామగిరి మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు మోత్కూరి అవినాష్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ మొగిలి నరేష్ యాదవ్, అట్టి తిరుపతిరెడ్డి, వేముల కనుకయ్య, మాజీ ఎంపీటీసీ కన్నూరి నర్సింగరావు, గ్రామ శాఖ అధ్యక్షులు తోగరి చంద్రయ్య, మైదం బుచ్చయ్య, ఐఎన్టీయూసీ నాయకులు తాటికొండ మొగిలి, శంకేసి రాజమల్లు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు జాగరి రజిత, మొగిలి రేణుక, కాంగ్రెస్ నాయకులు గొల్లపల్లి రాజమల్లు, కొడారి సాది, గాజుల భూమయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు కొండవేన ప్రభాకర్, ఆరెల్లి మహేందర్, భోగే ప్రకాష్, ఇరుగురాళ్ల రమేష్, బంక్ మల్లేష్, ఆర్ల సాయి తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply