ఘనంగా టైలరింగ్ సర్టిఫికెట్ల పంపిణీ
అయుష్ 24 న్యూస్విలేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్టీఐ ఆక్టివిస్ట్ సొసైటీ (RTIAS) రాష్ట్ర అధ్యక్షులు డా. కొర్ర కిషన్ నాయక్ హాజరయ్యారు.ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న చేరిపల్లి భార్గవి, బెల్లి శంకరమ్మలకు సర్టిఫికెట్లను అందజేశారు.ముఖ్యఅతిథి డా. కొర్ర కిషన్ నాయక్ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో నైపుణ్యం సాధించి ఆర్థికంగా స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు ఇలాంటి వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మహిళలు తమ కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భాషా చౌహన్, జి. నిహారిక, ఎన్. శాంతి, కె. కవిత తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply