మార్షల్ ఆర్ట్స్ రంగంలో ప్రతిభ కనబరిచిన పలువురికి సత్కారం
హైదరాబాద్:
మార్షల్ ఆర్ట్స్ రంగంలో విశిష్ట ప్రతిభ, సేవలు అందించిన వారికి అందజేసే మహేష్ గ్లోబల్ ఎక్సలెన్స్ మార్షల్ ఆర్ట్స్ బ్రూస్ లీ అవార్డులను పలువురు ప్రముఖులు ఘనంగా అందుకున్నారు.
మాస్టర్ కేశవ్ కరాటే అకాడమీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గబ్బర్ సింగ్ సాయి, శివం శివరాత్రి, కేశవ్ గౌడ్, కాజావుద్దీన్, అమర్ సింగ్ తదితరులు అవార్డులను ప్రముఖుల చేతుల మీదుగా స్వీకరించారు.
మార్షల్ ఆర్ట్స్ రంగంలో ప్రతిభ, క్రమశిక్షణ, సేవా భావంతో ముందుకు సాగుతున్న వారిని గుర్తించి ప్రోత్సహించడమే ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.
ప్రముఖుల చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం పట్ల అవార్డు గ్రహీతలు ఆనందం వ్యక్తం చేశారు. మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధికి కృషి చేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు.
అయుష్ 24 న్యూస్ ప్రతినిధి, హైదరాబాద్










Leave a Reply