మంథని, ఆగస్టు 25 | అయుష్ 24 న్యూస్
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఉపసర్పంచ్ కుటుంబ సభ్యులను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, మంథని మున్సిపల్ మాజీ చైర్మన్ పుట్ట శైలజ పరామర్శించారు.
గత నెల 25న అనారోగ్యంతో మృతి చెందిన ఇనుముల గౌరమ్మ నెల మాసికం సందర్భంగా పుట్ట మధుకర్, పుట్ట శైలజ మంగళవారం కుటుంబ సభ్యులను పరామర్శించారు. గౌరమ్మ మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. గత నెల 24న సికింద్రాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గౌరమ్మను పుట్ట మధుకర్ పరామర్శించారని, సరిగ్గా నెల రోజుల తర్వాత ఆమెను కోల్పోయిన తమ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన దంపతులు ఇంటికి రావడం తమకు ఎంతో ఆత్మీయతను కలిగించిందన్నారు.
దాదాపు 26 సంవత్సరాల తర్వాత తమ ఇంటికి వచ్చి, తల్లిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న తనను, కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజకు కుటుంబ సభ్యుల తరఫున ఇనుముల సత్యనారాయణ, హైకోర్టు న్యాయవాది, మంథని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజతో పాటు మంథని బీఆర్‌ఎస్ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply