Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › మాస్టర్ కేశవ్ గౌడ్‌కు ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు
బ్రేకింగ్ న్యూస్

మాస్టర్ కేశవ్ గౌడ్‌కు ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు

01:28 మధ్యాహ్నం PM

‘గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ అవార్డ్స్–2026’కు అధికారికంగా రికార్డు గుర్తింపు

హైదరాబాద్: వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 400 మంది ప్రతిభావంతులను ఒకే వేదికపై సత్కరించిన ‘గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ అవార్డ్స్–2026’ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారిక గుర్తింపు లభించింది.

తెలంగాణ రాష్ట్రం జడ్చర్ల కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెచ్యూర్ స్పోర్ట్స్ & కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి మాస్టర్ కేశవ్ గౌడ్ నాయకత్వం వహించారు. సెప్టెంబర్ 5, 2026న హైదరాబాద్ రామ్‌కోటి, తెలంగాణ సరస్వతి పరిషత్ ఆడిటోరియంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

క్రీడలు, నృత్యం, సామాజిక సేవ, కరాటే, వైద్య రంగం, న్యాయ రంగం, రెజ్లింగ్, ఉపాధ్యాయ వృత్తి, వ్యాపార రంగం, వివిధ మార్షల్ ఆర్ట్స్ విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన 400 మంది సాధకులను ఒకే వేదికపై ఘనంగా సన్మానించారు.

వివిధ రంగాల్లో ప్రతిభను గుర్తించి, వారిని ఒకే వేదికపై సత్కరించడం ద్వారా ప్రతిభావంతులను ప్రోత్సహించడంతో పాటు సమాజానికి స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించిన కార్యక్రమంగా ‘గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ అవార్డ్స్–2026’ నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.

అధికారికంగా రికార్డుల్లో నమోదు

400 మంది ప్రతిభావంతులను ఒకే వేదికపై సత్కరించిన ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారికంగా గుర్తించి తమ రికార్డుల్లో నమోదు చేసినట్లు ధృవీకరణ పత్రంలో పేర్కొంది.

ఈ గుర్తింపుతో కార్యక్రమ నిర్వాహకులు, మాస్టర్ కేశవ్ గౌడ్‌కు పలువురు అభినందనలు తెలిపారు.

జీనియస్ బుక్ ఆఫ్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ రవీందర్, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, మూవీ ఆర్టిస్టులు గబ్బర్ సింగ్ సాయిబాబా, శివం, సంజయ్, చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని, మాస్టర్ అమర్ సింగ్, మాస్టర్ మురళీకృష్ణంరాజు, మాస్టర్ నాగేష్ మల్లూరి, మాస్టర్ కాజావుద్దీన్, ఆంజనేయులు సాయి యాదవ్, అన్వర్ ఖాన్, సురేష్ గౌడ్, మహేష్, శివకుమార్ యాదవ్, శ్రీనివాస్ చారి తదితరులు మాస్టర్ కేశవ్ గౌడ్‌ను అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సత్కరించడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు యువతలో ప్రతిభను వెలికితీయడంతో పాటు మరింతగా సాధించాలనే స్ఫూర్తిని కలిగిస్తాయని పేర్కొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 113🔗 Shares: 0👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
22 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *