భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళీ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, ఆగస్టు 26: తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తమ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

బుధవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళీ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా హాజరైనట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా మురళీ.. తమ కుమార్తెకు తన అభిప్రాయాలు, భావాలు ఉండవచ్చని, ఆమె చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని తెలిపారు.
అలాగే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని కొండా మురళీ పేర్కొన్నారు. తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని, పార్టీని వీడే ఆలోచన లేదని తేల్చిచెప్పారు.
ప్రస్తుతం కొండా కుటుంబానికి సంబంధించిన అంశం కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉండటంతో, కమిటీ తుది నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
అయుష్ 24 న్యూస్










Leave a Reply