22ఏ భూముల సమస్యలపై హరీశ్‌రావుతో కలిసి చర్చ
దేవరకొండ: 99టీవీ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 22ఏ – “మా భూమి.. మా హక్కు” ప్రత్యేక డిబేట్ కార్యక్రమంలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.
ఈ డిబేట్లో మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు హరీశ్‌రావుతో కలిసి రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని, 22ఏ భూముల సమస్యలు, భూ హక్కులు, రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా భూములపై హక్కు కలిగి ఉన్న ప్రజలకు న్యాయం జరగాలని వారు పేర్కొన్నారు. 22ఏ జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు వారి భూ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రజల భూ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు.
అయుష్ 24 న్యూస్



Mahamood Mohammed






Leave a Reply