చెన్నైలో జరిగిన అంతర్జాతీయ కరాటే కార్యక్రమంలో ఘనత
మిర్యాలగూడ, ఆగస్టు 18 — అయుష్ 24 న్యూస్:మిర్యాలగూడ పట్టణానికి చెందిన SBI ఉద్యోగి శ్రీహరి నాయక్ కరాటేలో అసాధారణ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ నెల 16వ తేదీన చెన్నై మహానగరంలోని సెయింట్ థామస్ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలమురుగన్ ఆధ్వర్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ నిర్వహించిన భారీ కార్యక్రమంలో సుమారు 840 మంది కరాటే మాస్టర్లు పాల్గొన్నారు.సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా సంస్థలో శిక్షణ పొందిన శ్రీహరి నాయక్ తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సాధించి మిర్యాలగూడ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ స్థాయిలో నిలబెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రదర్శనకు విశేష ప్రశంసలు లభించాయి.ఈ కార్యక్రమంపై సీనియర్ మాస్టర్ బాండవతు రామకృష్ణ నాయక్ మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా చరిత్రలో సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఏకంగా మూడు సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన ఏకైక సంస్థగా నిలిచిందని తెలిపారు. ఈ ఘనత సంస్థకు మాత్రమే కాకుండా మిర్యాలగూడకు కూడా గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.మిర్యాలగూడకు చెందిన శ్రీహరి నాయక్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వేదికపై ప్రతిభ చూపడం ద్వారా ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చారని కరాటే వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
- — అయుష్ 24 న్యూస్










Leave a Reply