అన్నాచెల్లెళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీకగా రాఖీ పౌర్ణమి వేడుకలు
దేవరకొండ, ఆగస్టు 29 (అయుష్ 24 న్యూస్):
రాఖీ పౌర్ణమి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ కన్వీనర్ జూలూరి ధనలక్ష్మి హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగృహంలో ఆయనకు రాఖీ కట్టి ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్న ధనలక్ష్మి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. రాఖీ అనేది కేవలం ఒక దారం కాదని, అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, రక్షణకు ప్రతీక అని ఆమె పేర్కొన్నారు.
“అన్నా–చెల్లెళ్ల అనుబంధం ఎల్లప్పుడూ ఇలాగే ప్రేమగా, ఆత్మీయంగా, ఆనందంగా కొనసాగాలి” అని ధనలక్ష్మి ఆకాంక్షించారు.

రాజకీయ భేదాలకు అతీతంగా కుటుంబ బంధాలను గుర్తుచేసే రాఖీ పౌర్ణమి సందర్భంగా జరిగిన ఈ ఆత్మీయ కలయిక అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రత్యేక సందేశాన్ని అందించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లందరికీ ఆమె రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
📰 అయుష్ 24 న్యూస్
THE VOICE OF TRUTH










Leave a Reply