దేవరకొండ, సెప్టెంబర్ 5 (అయుష్ 24 న్యూస్): దేవరకొండ పట్టణంలో నిర్వహించనున్న శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి బోనాలు, ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా బీఆర్‌ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకుడు వడ్త్య రమేష్‌ను ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
ఆదివారం సెప్టెంబర్ 6, 2026న బోనాలు, సెప్టెంబర్ 9, 2026న అమ్మవారి ఆలయ వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా దేవరకొండలోని వడ్త్య రమేష్ నివాసానికి వెళ్లిన ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాల వివరాలను తెలియజేసి, వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ గుండాల అంజయ్య యాదవ్, నేతాల వెంకటేష్, పంగ అజయ్, వెంకటయ్య, జింకల విజయ్, ముసిని ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.



Musini.Anjan





Leave a Reply