ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు
పీఏ పల్లి మండలం: దేవరకొండ నియోజకవర్గం పీఏ పల్లి మండలం వద్దిపట్ల గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం, అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ కార్యక్రమంలో పాల్గొని ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరిగిన ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. నూతన ఆలయం నిర్మాణంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అజ్మాపురం మాజీ సర్పంచ్ రామకృష్ణ, నెల్లికంటి వెంకటేష్, ముత్యాలు సూర నాయక్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.









Leave a Reply