కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ, ఆగస్టు 20 — అయుష్ 24 న్యూస్:
బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు ముదిగొండ హరిదాస్ జన్మదిన వేడుకలను గురువారం దేవరకొండలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ హాజరై కేక్ కట్ చేసి హరిదాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ముదిగొండ హరిదాస్‌కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రజా సేవలో మరింత ముందుకు సాగుతూ మంచి పేరు సంపాదించుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ జన్మదిన వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యా నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు, బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ, కౌన్సిలర్లు పొట్ట మురళి, పొట్ట మధు, సర్పంచ్ అడారపు హరికృష్ణ, బొడ్డు మల్లేష్, జమీర్ బాబా, గుండాల వెంకట్, మైనంపల్లి ప్రవీణ్, బత్తుల ఆంజనేయులు, ప్రశాంత్, లడ్డు తదితరులు పాల్గొని ముదిగొండ హరిదాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply