నాల్గవ రోజు విశేష పూజలు చేసిన సింగం, నూతనకంటి దంపతులు
భక్తులకు అన్నదాన వితరణ
పట్టణంలోని మునగల కొండలరావు నగర్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కాలనీవాసులు సింగం మాధవి–జ్ఞానేశ్వర్ మరియు నూతనగంటి పద్మ–రామలింగం దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక గణపతి పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గణనాథుడికి ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు కేతావత్ హనుమాన్ నాయక్, కేతావత్ రాధాకృష్ణ–సరిత, సులోచన–గోవర్ధన్ రెడ్డి, అరుణ–సుధాకర్ రావు, పద్మ–శేఖర్ గౌడ్, పానుగంటి అనిత–వెంకటయ్య, నాగమణి–మహాలక్ష్మయ్య, కమల–లిమియా నాయక్, చెన్న సుజాత, రజిత–శీను నాయక్, సువర్ణ–రమేష్, కాశమ్మ–రాములు, కౌసల్య–మకట్లాల్, తార్య–వాలి, అలివేలు–వెంకటయ్య, రేవతి–శరత్, పద్మ–హరిలాలు తదితరులతో పాటు ఇతర కమిటీ ప్రతినిధులు, కాలనీవాసులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వాహకులు భక్తులకు మహా అన్నదాన ప్రసాద వితరణ చేపట్టారు.











Leave a Reply