ఇల్లందు, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: ఆర్‌సీ పేట గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన దంతోజు లక్ష్మయ్య భౌతికకాయానికి ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య నివాళులర్పించారు.
అనంతరం లక్ష్మయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే వారికి ధైర్యం చెప్పారు. విషాద సమయంలో కుటుంబానికి అండగా నిలుస్తూ దహన ఖర్చుల నిమిత్తం రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించడం పట్ల ధన్యవాదాలు చెప్పారు.
కష్టకాలంలో ప్రజలకు తోడుగా..
ప్రజా సేవలో ముందుండే కోరం కనకయ్య.










Leave a Reply