జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి
హైదరాబాద్ | అయుష్ 24 న్యూస్
హైదరాబాద్ రావిరాలలోని మెగా డెయిరీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, సంస్థ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, IASతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల సేవలను స్మరించుకోవాలని అన్నారు. వారి త్యాగాలు, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
రానున్న రోజుల్లో తెలంగాణ విజయ డెయిరీని మరింత అభివృద్ధి చేసి, సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు.
సంస్థ అభివృద్ధితో పాటు రైతులు, పాల ఉత్పత్తిదారులకు మరింత ప్రయోజనం కలిగే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply