Monday, 14 Sep 2026
14 Sep 2026Monday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › మెదక్ జిల్లాలో బీజేపీ ఎండోమెంట్ సెల్ నియామకాలు
బ్రేకింగ్ న్యూస్

మెదక్ జిల్లాలో బీజేపీ ఎండోమెంట్ సెల్ నియామకాలు

11:45 ఉదయం AM

మెదక్, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో ఎండోమెంట్ సెల్ నియామక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎండోమెంట్ సెల్ కన్వీనర్ సూర్య ప్రకాష్, కో-కన్వీనర్ నిరంజన్ దేశాయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మెదక్ జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలు, డివిజన్లు, వార్డుల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, సభ్యులను ఎండోమెంట్ సెల్‌లో నూతనంగా నియమించారు. కొత్తగా నియమితులైన సభ్యులు తమ పరిధిలోని దేవాలయాల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు సూచించారు.

అలాగే ఆలయాల అభివృద్ధి, దేవాదాయ ఆస్తుల పరిరక్షణ, భక్తుల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సమర్థవంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధితో పాటు సనాతన ధర్మం, హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాలు, ఆలయ సంస్కృతిని పరిరక్షించేందుకు ఎండోమెంట్ సెల్ మరింత విస్తృతంగా పనిచేస్తుందని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, రాష్ట్ర ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్ కవిత రెడ్డి, మెదక్ కంటెస్టెంట్ పంజా విజయ్, మెదక్ జిల్లా ఎండోమెంట్ సెల్ కో-కన్వీనర్లు ప్రసాద్, నవీన్, జాయింట్ కన్వీనర్లు నరేంద్ర, నవీన్, కృష్ణ, రాజేశ్వరి తదితరులు పాల్గొని నూతనంగా నియమితులైన సభ్యులకు అభినందనలు తెలిపారు.

— అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
721 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *