రామగిరి ప్రతినిది అయుష్ 24 న్యూస్ : రామగిరి మండలం సెంటినరీ కాలనీలో ఆదివారం నిర్వహించిన మేకల మార్కెట్ వార్షికోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మేకల మార్కెట్ యూనియన్ నాయకులు, సభ్యులు ఘనంగా సన్మానించారు.
వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేకల మార్కెట్ యూనియన్ నాయకులు మంత్రికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మేకల మార్కెట్ అభివృద్ధికి, వ్యాపారుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. మార్కెట్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మేకల మార్కెట్ యూనియన్ నాయకులు ఒర్రె సదయ్య యాదవ్, బనుక అంజి, అలువాల తిరుపతి, బత్తిని ఐలయ్య, ఒర్రె సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మేకల మార్కెట్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్









Leave a Reply