టేకులపల్లి, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: టేకులపల్లి మండలం మొక్కంపాడు గ్రామపంచాయతీ పరిధిలో 15 మంది లబ్ధిదారులకు 2బీహెచ్కే ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిన ఉత్తర్వులను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అందజేశారు.
పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు గృహ వసతి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇళ్ల మంజూరు ఉత్తర్వులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. పేద కుటుంబాలకు సొంతింటి భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
“పేదల సంక్షేమమే లక్ష్యం.. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల్పించడమే ధ్యేయం.” – కోరం కనకయ్య, ఎమ్మెల్యే










Leave a Reply