Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి
Home › బ్రేకింగ్ న్యూస్ › మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత: ఎమ్మెల్యే బాలునాయక్
బ్రేకింగ్ న్యూస్

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత: ఎమ్మెల్యే బాలునాయక్

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి నాటిన మొక్కలను సంరక్షించి పెద్ద చెట్లుగా పెంచాలి: ఎమ్మెల్యే చింతపల్లి: పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్ పిలుపునిచ్చారు.

11:30 ఉదయం AM

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
నాటిన మొక్కలను సంరక్షించి పెద్ద చెట్లుగా పెంచాలి: ఎమ్మెల్యే
చింతపల్లి: పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్ పిలుపునిచ్చారు.
చింతపల్లి మండలం పోలేపల్లి–రాంనగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వనమైసమ్మ గుడి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే బాలునాయక్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతపై ఆయన మాట్లాడారు.
మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెరగడంతో పాటు వాతావరణ సమతుల్యత కాపాడబడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. చెట్లు గాలిలోని కాలుష్యాన్ని తగ్గించి ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
కేవలం మొక్కలు నాటడంతో కార్యక్రమం పూర్తికాదని, నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా సంరక్షించి అది పెద్ద చెట్టుగా ఎదిగేలా చూడాలని ఆయన సూచించారు.
ప్రతి గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని, ప్రజలు, యువత, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే బాలునాయక్ కోరారు. పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ మొక్కల సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జాటావత్ హరినాయక్, దొంతమోని యాదమ్మ, మాస భాస్కర్, దొంతినేని వెంకటేశ్వరరావు, సిద్దగోని కృష్ణ గౌడ్, మునుకుంట్ల శేఖర్, కొడిదొడ్డి శంకర్, కొప్పుల జంగయ్య, నేనావత్ జవహర్ లాల్, నేనావత్ వసంత్ నాయక్, ఉప్పు శ్రీశైలం, కేతావత్ శ్రీను, మునుకుంట్ల శేఖర్ గౌడ్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
— Ayush 24 News
The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 37🔗 Shares: 4👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
262 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App