విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో నేటికీ తెరుచుకోని హాస్టల్
రెండు రోజుల్లో ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం: బొడ్డుపల్లి కృష్ణ
పీఏ పల్లి, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: పీఏ పల్లి మోడల్ స్కూల్ హాస్టల్‌ను తక్షణమే ప్రారంభించాలని బీఆర్‌ఎస్‌వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు.
మంగళవారం పీఏ పల్లిలో ఆయన మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నప్పటికీ మోడల్ స్కూల్ హాస్టల్ నేటికీ ప్రారంభం కాకపోవడం విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
హాస్టల్ ప్రారంభం కాకపోవడంతో మోడల్ స్కూల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. హాస్టల్ సౌకర్యం లేక విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి హాస్టల్‌ను ప్రారంభించే చర్యలు చేపట్టాలని బొడ్డుపల్లి కృష్ణ డిమాండ్ చేశారు.
రెండు రోజుల్లోగా పీఏ పల్లి మోడల్ స్కూల్ హాస్టల్‌ను ప్రారంభించకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని విద్యాశాఖ అధికారులను ఆయన హెచ్చరించారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికారులు ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడి తక్షణమే హాస్టల్‌ను ప్రారంభించాలని బొడ్డుపల్లి కృష్ణ కోరారు.










Leave a Reply