జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
రంగారెడ్డి | అయుష్ 24 న్యూస్
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గౌరవాన్ని చాటారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను, సమాజ సేవలో విశేష సేవలు అందిస్తున్న ప్రముఖులను, ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులను ప్రత్యేకంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అన్ని సామాజిక వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా, గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యంతో తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రముఖులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

— అయుష్ 24 న్యూస్










Leave a Reply