ప్రమిద కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా కార్యక్రమం.. పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు
రంగారెడ్డి | అయుష్ 24 న్యూస్
రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని ప్రమిద కన్వెన్షన్ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు.
తెలంగాణ యాదవ కురుమ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రఘునాథ్ యాదవ్తో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను దశలవారీగా కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply