అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి
పరిగి, సెప్టెంబర్ 1, 2026 | అయుష్ 24 న్యూస్: పరిగి మండలం రాపోల్ గ్రామంలోని రైతు వేదికలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి (TRR) గారు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ రేషన్, సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందనున్నాయి.
అయుష్ 24 న్యూస్ 📰










Leave a Reply