రామగిరి, ఆగస్టు 25 – అయుష్ 24 న్యూస్
మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ రామగిరి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రత్నాపూర్ గ్రామానికి చెందిన కీ॥శే॥ ఉడుత మల్లక్క దశదినకర్మ కార్యక్రమంలో తొట్ల తిరుపతి యాదవ్ పాల్గొన్నారు. అనంతరం కల్వచర్ల గ్రామానికి చెందిన ఇటీవల మృతి చెందిన కీ॥శే॥ కాట ప్రమీల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అలాగే వెంకట్రావుపల్లె మాజీ ఎంపీటీసీ బత్తిని శ్రీనివాస్ తల్లి కీ॥శే॥ లక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రామగిరి మండలం మాజీ ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, రామగిరి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కండె పోషం, మాజీ సర్పంచ్ ఎరుకల ఓదెలు, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు మట్ట రాజకుమార్, మాజీ ఉపసర్పంచ్ నరేష్ యాదవ్, మాజీ ఉపసర్పంచ్ కనుకయ్య, రత్నాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేష్, కల్వచర్ల గ్రామ శాఖ అధ్యక్షులు కృష్ణమూర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒర్రె సది, బర్ల శ్రీకాంత్, సదానందం, గొల్లపల్లి రాజమల్లు తదితరులతో పాటు రత్నాపూర్, కల్వచర్ల, వెంకట్రావుపల్లె గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










Leave a Reply